![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -356 లో.. రాజ్ తన అంతరత్మతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇన్ని రోజులు అంత అందమైన భార్యని దూరం పెట్టావ్.. ఇప్పుడు తన బావకి దగ్గర చేస్తున్నావంటూ తన అంతరాత్మ రాజ్ ని తిడుతుంది. మరొకవైపు అనామిక, ధాన్యలక్ష్మిలు వచ్చి కనకం-కృష్ణమూర్తిలని అవమానిస్తారు.
ఆ తర్వాత అసలు ఏమైందని అలా మాట్లాడుతున్నారని కనకం అడుగుతుంది. బయట నీ కూతురు నా కొడుకుతో తిరుగుతుంది సిగ్గు లేకుండా అలాగేనే ప్రవర్తించేదంటు ధాన్యలక్ష్మి తిడుతుంది. ఇక్కడ అంత సిగ్గు లేకుండా బ్రతికేవాళ్ళు ఎవరు లేరని కనకం అంటుంది. ధాన్యలక్ష్మి నోటికి ఇష్టం వచ్చినట్లు కనకాన్ని తిడుతుంది. ఈ రౌడీలతో మనకేంటి ఇంకొకసారి అది నా భర్తతో కన్పిస్తే నడిరోడ్డుపై చెప్పుతో కొడుతానని అనామిక అంటుంది. దానికి కూడా మంచి షూ ఉన్నాయ్ చూసుకోమని కనకం అంటుంది. కాసేపటి తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్లిపోతారు. వాళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారని కనకం కృష్ణమూర్తిలు అనుకుంటారు. ఆ తర్వాత కావ్యపై రాజ్ ప్రేమని బయట పెట్టాలని ఇందిరాదేవి ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా కావ్యకి ఇందిరాదేవి విడాకుల పత్రాలు ఇస్తుంది. అవి రాజ్ కి ఇవ్వు అప్పడు నువ్వు దూరం అయిపోతున్నవని వాడు నీపై ప్రేమని బయట పెడతాడని కావ్యని ఇందిరాదేవి ఒప్పిస్తుంది.
మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు ఇంటికి వస్తారు. ఇంటివరకు వచ్చాను కదా పలకరించి వెళ్తానని కళ్యాణ్ అంటాడు. మీరు ఇలా కలవడం తప్పు మీకు పెళ్లి అయింది భార్య ఉంది.. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని కనకం అంటుంది. మీ మనసులో ఏ ఉద్దేశం ఉండదు అది మాకు తెలుసు కానీ చూసేవాళ్ళకి తెలియదు కదా అని కృష్ణమూర్తి అంటాడు. ఇప్పుడు ఎవరు చూసారు చెప్పండని కళ్యాణ్ అడుగుతాడు. కనకం చెప్పబోతుంటే వద్దు ఈ గొడవ ఇక్కడితో అయిపోనివ్వని కృష్ణమూర్తి అంటాడు. మీతో ఎవరు అన్నారో చెప్పేవరకు నేను ఇక్కడ నుండి వెళ్ళనని కళ్యాణ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య విడాకులు పత్రంపై సంతకం చేసి రాజ్ కి ఇస్తుంది. అది చూసిన రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |